కోచ్ లు మారుతున్నాయి..
భారతీయ రైల్వే కొన్ని సెక్టార్లలో రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో కోచ్‌లను మార్చాలని ప్లాన్ చేస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో ఉన్న అన్ని ఎసి-2టైర్ కోచ్‌లను ఏసి-3కోచ్‌లుగా మార్చబోతోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఏడాది అన్ని ఏసి-2 టైర్ కోచ్‌లను తీసేసి, 250 ఏసి-3టైర్ కోచ్‌లను ఇన్స్టాల్ చేయబోతోంది. సీనియర్ రైల్వే అధికారి ఈ విషయాన్ని ధవీకరించారు. ప్రతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో రెండు ఏసీ-2 టైర్కోచ్లు ఉంటాయి. వాటిని కొంతమంది ప్యాసెంజర్లు మాత్రమే బుక్ చేసుకుంటున్నారని, దీంతో రైల్వేకు రెవెన్యూ నష్టాలు వస్తున్నట్లు సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. మరోవైపు ఏసీ-3టైర్ కోచ్‌లకు రైళ్లలో భారీ ఎత్తున డిమాండ్ ఉంటుంది. బ్రేక్ ఈవెన్ మార్కును కూడా ఇవి చేధించి, లాభాలను ఆర్జిస్తున్నాయి.













