2019 ప్రపంచ కప్ లో భారత్ ప్రారంభ మ్యాచ్ తేదీ మార్పు
ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న 2019 ప్రపంచ కప్ క్రికెట్లో భారత్ తన ప్రారంభ మ్యాచ్ ఆడే తేదీ మార్చాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. దక్షిణాఫ్రికాతో ఆడే తొలి మ్యాచ్‌ను జూన్ 2 బదులు, జూన్ 5న జరపాలని కోరింది. క్రికెట్లో సం ్కరణలకోసం నియమించిన లోదా కమిటీ చేసిన సిఫారసులమేరకు ఆ ఏడాది జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు భారత్ ప్రపంచకప్‌లో ఆడే ప్రారంభ మ్యాచ్‌కు మధ్య కనీసం 15రోజుల ఖాళీ ఉండాలి. ఈ మేరకు బీసీసీఐ తన వాదనను ఐసీసీకు తెలిపింది. మంగళవారం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్న సమావేశంలో ఈ విషయంపై చర్చ సాగింది. 2019 ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి 29 నుంచి మే 19వరకు జరుగుతాయి. ప్రపంచకప్ మే 30 నుంచి జూలై 14వరకు జరుగుతుంది. షెడ్యూలు ప్రకారం జూన్ 2న దక్షిణాఫ్రికాతో, భారత్ ఆడాల్సి ఉంది. 15రోజుల గ్యాప్ ఉంటేనే మ్యాచ్ ఆడగలుతాము. జూన్ 5కు ఈ మ్యాచ్‌ను వాయిదా వేస్తే అది వీలవుతుంది అని బీసీసీఐ అధికారులు సమావేశంలో పేర్కొన్నారు.













