కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఇ-సిగరెట్లపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక నుంచి వీటి తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, విక్రయాలు, పంపిణీ, నిల్వ చేయడం, ప్రచారం వంటి అంశాలపై నిషేధం విధించినట్లు ఆమె వెల్లడించారు. ఇ-సిగరెట్ల వల్ల యువతపై తీవ్రమైన చెడుప్రభావం పడుతోందని తెలిపారు. అలాగని తాము సాధారణ సిగరెట్లను ప్రోత్సహించడం లేదని తెలిపారు. అమెరికా అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. పొగాకు వినియోగం తగ్గించాలనేది ప్రభుత్వ ఆశయమన్నారు.













