కుటుంబాన్ని కలిపిన ఫేస్బుక్
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు విశాఖ మానసిక ఆసుపత్రి వైద్యులు చికిత్సనందించి తిరిగి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇందుకు ఫేస్బుక్ సహకరించింది. నాగ్‌పూర్‌కు చెందిన సోనమ్ రోహిత్ గీత్యా(30) మానసిక స్థిమితం కోల్పోయి విజయనగరంలో రహదారులపై తిరుగుతుండేది. పోలీసులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఆయన ఆదేశాల మేరకు విశాఖలోని మానసిక వైద్యశాలలో గత జులైలో అధికారులు చేర్పించారు. అప్పటి నుంచి వైద్యులు కె.వి.రామిరెడ్డి, మాధవీలత చికిత్సనందించారు. కోలుకున్న సోనమ్ చెప్పిన ఫేస్బుక్ ఖాతా ఆధారంగా స్నేహితుల వివరాలను సేకరించి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకున్నారు. నాగ్‌పూర్‌లోని సోనమ్ తండ్రి రాజేష్ మెశ్రమ్కు సమాచారమిచ్చారు. విశాఖలోని మానసిక వైద్యశాలకు తండ్రి రాజేష్ చేరుకుని కుమార్తెను కలుసుకున్నారు.













