చేపలు తింటే గుండెకు మేలు!
వారానికి రెండుసార్లు చేపలు తింటే గుండెకు ఎంతోమేలు అని శాస్త్రీయ అధ్యయనంలో తేలింది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు తినడం వల్ల గుండెపోటు, పక్షపాతం రావని అమెరికా హృదయ సంఘం చేసిన అధ్యయనంలో నిర్థారణ అయింది. వారానికి కనీసం రెండుసార్లు నూనెలో వేపకుండా కూరలా వండిన వందేసి గ్రాముల చొప్పున తినాలని ఆ సంఘం సూచించింది. కోడిమాంసం, గొర్రె-మేక, పంది, ఈముమాంసం కంటే నూనెశాతం ఎక్కువగా ఉండే చేపలు తింటే మంచిదని ప్రొఫెసర్ ఎరిక్ బి.రిమ్ పేర్కొన్నారు. ఈ పరిశోధనలో పాలుపంచుకున్న పలువురు పౌష్టికాహార నిపుణులు సైతం పాదరసం ప్రభావంలేని సముద్రచేపలు పెద్దలే తింటే మేలని, చిన్నారులు తింటే తీవ్ర నరాల సమస్యలకు దారి తీయవచ్చని హెచ్చరించారు.













