దుబాయ్‌లో ధూంధాం
తెలంగాణ కార్మికులు దుబాయ్‌లోని అల్కోజ్ ప్రాంతంలో ఉన్న డల్స్కో ఈవెంట్ హాల్లో ఎన్ఆర్ఐ పాలసీ సాధాన ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించారు. గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 3000 మంది కార్మికులు పాల్గొన్నారు. రచయిత ప్రశాంత్ కోరెపు రచించిన గల్ఫ్ బతుకు గాధ పాటల సిడిని మ్యూజిక్ ఇండియా ప్రముఖ గాయకురాలు ప్రశాంతి చోప్రా విడుదల చేశారు. అనంతరం సిడిలోని మొదటి పాటన గాయకులు కోరెపు మల్లేష్ గౌడ్ పాడి ధూంధాంను ప్రారంభించారు. అలాగే ప్రముఖ జానపద కళాకారులు జంగిరెడ్డి, రేలారెరేలా ఫేం గంగ కార్యక్రమానికి హాజరై పాటలు పాడి గల్ఫ్ కార్మికులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక నాయకులు గుండెల్లి నరసింహ, కి•ష్ణ దొనికేని, వంశీ బంటి మాట్లాడుతూ ఎన్ఆర్ఐ పాలసీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.













