సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రైలు ఎక్కేటపుడు, దిగేటపుడు ప్రయాణికులు ప్రమాదాలకు గురై మరణించినా, గాయపడినా వారికి రైల్వేశాఖ నష్టపరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు సృష్టం చేసింది. ఇలాంటి ప్రమాదాల్లో ప్రయాణికుడి నిర్లక్ష్యం వల్ల జరిగిందని రైల్వేశాఖ తప్పించుకోలేదని సుప్రీంకోర్టు బెంచ్ జడ్జీలు ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారీమన్ లు సంచలన తీర్పు ఇచ్చారు. ప్రయాణికులు రైలు ఎక్కేటపుడు, దిగేటపుడు ప్రమాదాలు వాటిల్లితే వారు రైల్వేశాఖ నుంచి నష్టపరిహారం పొందేందుకు అర్హులని సుప్రీం తేల్చి చెప్పింది. రైల్వే యాక్ట్ 1989 సెక్షన్ 124 ఎ ప్రకారం ప్రయాణికులు మరణించినా, గాయపడినా బాధితులకు నష్టపరిహారాన్ని రైల్వేశాఖ చెల్లించాలి. ఈ కేసుల్లో హైకోర్టులు వివిధ రకాల తీర్పులు వెలువరిస్తున్నాయని, ప్రయాణికుల నిర్లక్ష్యం వల్లే మరణించారని రైల్వేశాఖ తప్పించుకోజాలదని సుప్రీంకోర్టు సృష్టం చేసింది.













