సీపీఎం పార్టీ కీలక నిర్ణయం
సీపీఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పోటీ చేయడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 6న ఢిల్లీలో జరిగిన సీపీఎం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు సృష్టం చేశాయి. ప్రస్తుతం సీపీఎం పోలిట్‌బ్యూరోలో కేరళ నాయకుల ప్రాబల్యం కనిపిస్తుందని, సీపీఎం పార్టీ ఒకే నాయకుడిని రెండు సార్లు రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం లేదని పార్టీకి చెందిన సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. సీతారాం ఏచూరి 2005 నుంచి 2017 వరకు రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయిన విషయం తెలిసిందే.













