విశ్వాస పరీక్షలో నెగ్గిన యడియూరప్ప
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో కమలం వికసించింది. బలపరీక్షలో బీజేపీకి మద్దతుగా 106 ఓట్లు పడ్డాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే రెండు ఓట్లు అదనంగా రావడంతో యడియూరప్ప బలపరీక్షలో గెలుపొందారు. మూజువాణి ఓటు ద్వారా ఆయన విశ్వాస పరీక్షల్లో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో సభలోని సంఖ్య 207 కు చేరింది. బల పరీక్షలో నెగ్గేందుకు కావాల్సిన సభ్యుల సంఖ్య 104. సొంత పార్టీ బలంతో 105తో పాటు ఒక స్వతంత్య్ర అభ్యర్థి మద్దతివ్వడంతో యడ్డీ విజయం లాంఛనమైంది.













