అందరి మనుసు గెలుచుకున్న పోలీస్
రాష్ట్రపతి కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్ వెళ్లేందుకు దారినిచ్చిన ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి అందరి మనసులను గెలుచుకున్నారు. బెంగళూరులో ట్రినిట్ కాలేజ్ చౌరస్తా మీదుగా రాష్ట్రపతి కాన్వాయ్ రాజ్‌భవన్ వెళ్తుండగా ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఎంఎల్ నిజలింగప్ప రాష్ట్రపతి కాన్వాయ్‌ని ఆపి అంబులెన్స్ దారి ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతి కాన్వాయ్‌ని పంపించారు. ప్రతి భారతీయుడు ఓ విఐపి అన్న ప్రధానమంత్రి మాటలు ఈ సందర్భంగా ప్రతిధ్వనించాయి. రాష్ట్రపతి నమ్మ మెట్రో గ్రీన్‌లైన్‌ను ప్రారంభోత్సవం చేయడానికి బెంగళూరుకు వచ్చారు. పోలీసు అధికారులు నిజలింగప్పను అభినందించి ఆయనకు రివార్డ్ ప్రకటించారు. సమయస్ఫూర్తితో వ్వవహారించిన నిజలింగప్పను అభినందిస్తూ పోలీస్ కమిషనర్ ప్రవీన్ సూద్ ట్వీట్ చేశారు. కొద్దీ గంటల్లోనే ట్వీట్ వైరల్‌గా మారి నెటిజన్ల ప్రశంసలు అందుకొంది.













