త్వరలో సైనా నెహ్వాల్ పెళ్లి !
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు త్వరలో ఒకటికాబోతన్నారు. మహిళ షట్లర్ సైనా నెహ్వాల్, మెన్స్ స్టార్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ త్వరలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. వచ్చే డిసెంబర్లో హైదరాబాద్ వేదికగా అరగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించడంతో డిసెంబర్ 16న దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగే వివాహం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్‌కు అన్ని రంగాల ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇద్దరు బ్యాడ్మింటన్‌లోనే కొనసాగుతూ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తాజాగా తెలిసింది. తమ సహచర ఆటగాళ్లకు తమ ప్రేమాయాణం గురించి తెలిసినా, బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.













