జూన్ 28 నుంచి అమర్నాథ్ యాత్ర
ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది 60 రోజులపాటు కొనసాగనుంది. జ్వేష్ఠపూర్ణిమనాడు (జూన్ 28న) దీన్ని ప్రారంభించనున్నట్లు దేవస్థాన బోర్డు అధికార ప్రతినిధి తెలిపారు. బోర్డు సభ్యులతో సమవేశమై అనంతరం బోర్డు చైర్మన్, రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోరా తేదీలను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. మరో వైపు దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని ఈ దేవాలయ పరిసరాల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలపైనా చర్చించామని, వీటిపై సమీక్షా పిటిషన్ దాఖలు చేస్తామని అన్నారు. దేవాలయ పరిసరాల్లో అందరూ నిశ్శబ్దం పాటించాలని ట్రైబ్యునల్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నిరసనలు వ్యక్తం కావడంతో గుహతో మంత్ర ఉచ్చారణలు, భజనలపై తాము ఎలాంటి నిబంధనలూ విధించడంలేదని ఎన్జీటీ సృష్టతనిచ్చింది. మంచు లింగం ముందుకు వెళ్లినప్పుడు మాత్రం అందరూ నిశ్శబ్ధంగానే ఉండాలని సృష్టీకరించింది.













