ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్రానికి విపక్షాల భరోసా
పుల్వామా దాడిని అఖిల పక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇవాళ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో శనివారం అఖిల పక్ష పార్టీ భేటీ జరిగింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటికి తాము పూర్తి మద్దతు ఇస్తామని ప్రతిపక్షాలు భరోసా ఇచ్చాయి. ఈ భేటీకి అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. పుల్వామా దాడి వివరాలను, కేంద్రం ఇప్పటివరకు చేపట్టిన చర్యలను కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతలకు వివరించారు. అనంతరం ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఈ భేటీలో ఆమోదించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు, ఉగ్రవాదులతో పోరాటం చేస్తున్న మన భద్రతా బలగాలకు మేం అండగా ఉంటామని తీర్మానంలో పేర్కొన్నారు.













