రూ.99కు దేశీయ, రూ.444కు విదేశీ విమాన టిక్కెట్
మలేషియాకు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియా టిక్కెట్లపై బంపర్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. వచ్చే ఏడాది మే నుంచి జనవరి, 2019 మధ్య కాలంలో దేశ, విదేశాల్లోని కొన్ని నగరాలకు వెళ్లే విమాన ప్రయాణికులు సంస్థ విమానాల్లో ఈ ఆఫర్ కింద రూ.99 రూ.444 కనీస ధర (బేస్ ఫేర్)తో వన్‌వే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. దేశంలోని ప్రధాన నగరాలకు రూ.99, విదేశాలకు రూ.444 కనీస చార్జీతో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్యూయల్ సర్‌చార్జి, ఎయిర్ పోర్టు ఫీజు, ఇతర పన్నులు దీనికి అదనం. ఆదివారం రాత్రి 9:30 గంటల నుంచి ఈ నెల 19 వరకు ఎయిర్‌లైన్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే ఈ టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. దీని వల్ల హాలీడే ప్రయాణికులు తమ ప్రయాణాల్ని మరింత బాగా ప్లాన్ చేసుకోగలుగుతారు అని ఏయిర్‌ఏషియా ఇండియా ఎండి, సిఇఒ అమర్ అబ్రోల్ తెలిపారు.













