హైదరాబాద్ టూ భోపాల్ మధ్య ఎయిర్ ఇండియా సేవలు
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్ మీదుగా భోపాల్‌కు విమాన సర్వీసును నడుపనున్నట్లు ప్రకటించింది. వారానికి మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనున్న ఈ సర్వీసును శనివారం ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం సంస్థ 70 మంది ప్రయాణికులు కూర్చోవడానికి వీలుండే ఏటీఆర్-72 ఎయిర్ కాప్ట్ర్ను వినియోగించనున్నది. ఉదయం 6:10 గంటలకు హైదరాబాద్‌లో బయలు దేరనున్న ఈ విమానం రాయ్‌పూర్‌కు 7:50 గంటలకు చేరుకోనున్నది. తిరిగి రాయ్‌పూర్‌లో 8:15 గంటలకు బయలుదేరి భోపాల్‌కు 9:45 గంటలకు చేరుకోనున్నది. తిరుగు ప్రయాణంలో భోపాల్‌లో ఉదయం 10:10 గంటలకు బయలుదేరి రాయ్‌పూర్‌కు 11:40కి చేరుకోనున్న ఈ సర్వీసు హైదరాబాద్‌కు మధ్యాహ్నం 1:45 గంటలకు చేరుకోనున్నది. సోమ, బుధ, శనివారాల్లో మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉండనున్నదని ఆ వర్గాలు వెల్లడించాయి.













