రూపాయికే విమాన టికెట్!
ఎయిర్ డెక్కన్ మళ్లీ వచ్చింది. రూపాయికే విమాన టికెట్ అంటూ ఊరిస్తున్నది. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ లేదా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (యూడీఏఎన్) కింత తమ ఆపరేషన్స్‌ను ఈ నెల 22 నుంచి మొదలుపెట్టనుంది. ఎయిర్ డెక్కన్ తొలి విమానం ముంబై, నాసిక్ మధ్య ఎగరనున్నది. ఇందులో రూ.1400 నుంచి ప్రారంభ ధరలు ఉన్నా, కొందరు లక్కీ విన్నర్లకు రూపాయికే ఇస్తామని సంస్థ ప్రకటించింది. గంటలోపు ప్రయాణానికి రూ.2500కే టికెట్ అంటూ ఈ యూడీఏఎన్ స్కీమ్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. దీనికింద ఐదు ఎయిర్‌లైన్స్ 12 రూట్లలో తమ విమానాలను నడిపే అవకాశం కల్పించారు. మార్చిలో ఈ అనుమతులు జారీ కాగా, సర్వీసులను ప్రారంభించేందుకు సెప్టెంబర్ 30తోనే ఈ డెడ్‌లైన్ ముగిసింది.
ఈ స్కీమ్ కిందే ఎయిర్ డెక్కన్ 34 రూట్లను సొంతం చేసుకుంది. ఎయిర్ డెక్కన్తోపాటు ఎయిర్ ఒడిశా, అలయెన్స్ ఎయిర్, స్పైస్ జెట్, ట్రూజెట్ ఈ 12 రూట్లను సొంతం చేసుకోగా, ప్రస్తుతం కేవలం 15 రూట్లలోనే ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ హక్కులు దక్కించుకున్న ఎయిర్‌లైన్స్ తమ విమానంలో ఉన్న సగం సీట్లను డిస్కౌంట్లలో ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుంది.













