1993 ముంబై పేలుళ్ల కేసులో తీర్పు…
ముంబై పేలుళ్ల కేసులో టాటా కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఆరు మందిని దోషులుగా తేల్చింది. నిందితులుగా ఉన్న గ్యాంగ్‌స్టర్ అబూ సలెమ్తో పాటు మరో అయిదుగుర్ని కోర్టు దోషులుగా ప్రకటించింది. కుట్ర, ఉగ్రచర్యల కింద వీళ్లను కోర్టు దోషులుగా తేల్చింది. గ్యాంగ్‌స్టర్ అబూ సలెమ్తో పాటు తాహిర్ మర్చంట్, ఫిరోజ్ ఖాన్‌ను ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారులుగా కోర్టు భావించింది. ఈ ఉదయం గ్యాంగ్‌స్టర్ అబూ సలెమ్‌ను ముంబైలోని టాడా కోర్టుకు తీసుకువచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 326, 324, 436, 201, 212, 302, 307 సెక్షన్ల కింద అబూ సలెమ్‌ను దోషిగా తేల్చారు. సంజయ్ దత్‌కు ఆయుధాలు సరఫరా చేసిన అబ్దుల్ ఖయ్యూమ్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది.













