Esma: అసలు ఎస్మా అంటే ఏంటీ..?
కొన్ని కొన్ని సమయాల్లో మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం. కరోనా టైంలో క్వారంటైన్, మాస్ వ్యాక్సినేషన్ వంటి మాటలు మనకు ఎక్కువగా వినపడ్డాయి. ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ యుద్ధం సందర్భంగా దేశం మొత్తం ఎస్మా (ESMA – Essential Services Maintenance Act ) అనే చట్టం గురించి వింటుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు నిరసన సమయంలో దీన్ని వాడుతూ ఉంటారు. మరి గ్యాస్ కొరత కోసం ఎందుకు వాడారు..? అసలు ఈ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు..? ఎందుకు ఈ చట్టాన్ని వాడతారు..? ఈ స్టోరీలో చూద్దాం.
అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా మన దేశ ఇంధన సరఫరాలో 85% కంటే ఎక్కువగా ఆగిపోయింది. కారణం హార్ముజ్ జలసంధిని(Strait of Hormuz) ఇరాన్ అడ్డుకోవడం. ఇక్కడి నుంచే 85 శాతం చమురు మన దేశానికి వస్తు ఉంటుంది. ఈ తరుణంలో ఇంధన సంక్షోభం తీవ్రమవుతున్న నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వం అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ESMA)ను అమలులోకి తెచ్చింది. కొన్ని రంగాలకు గ్యాస్ ను ఖచ్చితంగా సప్లై చేసేందుకు.. చట్టాన్ని అమలు చేస్తున్నారు. గ్యాస్ ను గృహ అవసరాల నుంచి పరిశ్రమల వరకు ఎక్కువగా వాడుతూ ఉంటారు.
ఇవి కూడా చదవండి
దీనితో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఎస్మా అంటే ఏంటీ..? 1968లో పార్లమెంటు ఎస్మాను ఆమోదించింది. కొన్ని సేవలను అందించడంలో ఆటంకం కలిగితే ప్రజల సాధారణ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇందులో ప్రజా రవాణా (బస్సు సేవలు), ఆరోగ్య సేవలు (వైద్యులు, ఆసుపత్రులు) వంటి సేవలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ లోని ఉమ్మడి జాబితాలోని జాబితా సంఖ్య 33 కింద పార్లమెంటు దీనిని ఆమోదించింది.
దేశవ్యాప్తంగా అవసరమైన సేవలకు ఏ ఇబ్బందులు లేకుండా దేశం మొత్తం ఒకే విధంగా అమలు చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్మా విషయంలో తీవ్ర విమర్శలు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం.. ఉద్యోగుల నిజమైన డిమాండ్ లను ఎస్మా అణచివేస్తుంది అనే విమర్శలు ఉన్నాయి. సాధారణ పరిస్థితులలో దాని అమలు పూర్తిగా ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. 1980 ల ప్రారంభంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మెలను అడ్డుకోవడానికి ఇందిరా గాంధీ సర్కార్ ఎస్మాను ప్రయోగించింది.
ఇవి కూడా చదవండి







