ఒపెక్ కూటములకు షాక్.. యూఏఈ ఎగ్జిట్..!
ఒపెక్ ప్లస్ దేశాల కూటములకు యూఏఈ షాకిచ్చింది. ఈ రెండు కూటముల నుంచి సడన్ గా ఎగ్జిట్ అయింది. మే 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని యూఏఈ తెలిపింది. చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు ఇది పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్)లో 60 ఏళ్లుగా యూఏఈ సభ్యదేశంగా ఉంది. ఒపెక్ ఏర్పాటైన ఏడేళ్ల తర్వాత 1967లో యూఏఈ ఇందులో చేరింది. సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. సుదీర్ఘకాలం పాటు సభ్యదేశంగా కొనసాగిన యూఏఈ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. . అయితే తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇరాన్ పెద్దఎత్తున.. యూఏఈపై దాడులు చేసింది. ఈ సమయంలో ఒపెక్, ఒపెక్ ప్లస్ కూటములు సరిగ్గా స్పందించలేదన్న భావనలో యూఏఈ ఉంది. దీనికి తోడు తమ అంతర్గత చమురు ఉత్పత్తుల పెంపు విషయంలోనూ భారీ సంస్కరణలు అమలు చేయాలని భావిస్తోంది యూఏఈ అందుకే.. రెండు కూటముల నుంచి బయటకు వచ్చేసింది యూఏఈ. దీంతో ఈ రంగంలో అనూహ్య పరిణామాలు సంభవిస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








