‘హిందూత్వ’ పాలిటిక్స్..
అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి చేసిన మోడీ సర్కార్.. దాన్ని ఎన్నికల ముందు అంటే 2024 జనవరిలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు..
ఎన్నికల సమయంలోనూ హిందూత్వ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ సీనియర్ నేత,
మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్.. ముందే పాచిక విసిరారు. హిందూత్వ క్రెడిట్ ఒక్క బీజేపీదే కాదని, ఇందులో కాంగ్రెస్ కు వాటా ఉంటుందని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. బాబ్రీ స్థలం గేటును ఓపెన్ చేయించింది రాజీవ్ గాంధీ అన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు.. తాను హనుమాన్ భక్తుడినని.. చిండ్వారాలో 101 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అంశాన్ని ప్రస్తావించారు కమల్ నాథ్.
అయితే కమల్ నాథ్ వ్యాఖ్యలపై కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ క్రెడిట్ హిందువులందరికీ చెందుతుందన్నారు. ఇప్పటివరకూ ఈ అంశంపై తాము
క్రెడిట్ తీసుకోలేదన్నారు. అంతే కాదు.. కమల్ నాథ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమల్ నాథ్ .. ఈ రాష్ట్రానికీి చేసిందేమీ లేదన్నారు హోంమంత్రి అమిత్ షా.
మరోవైపు కమల్ నాథ్ వ్యాఖ్యలపై రాహుల్ సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ, ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ విధానాలు
ఒకటేనని ఆరోపించారు. కాంగ్రెస్ ది జూటా సెక్యులరిజం అన్నారు. భారత్ జోడో అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నా రాహుల్…దీనికి ఏం సమాధానమిస్తారని ప్రశ్నించారు.
అయితే కమల్ నాథ్.. హిందూత్వం విషయంలో ఎప్పుడు ఓపెన్ గానే ఉంటారు. గుళ్లు,గోపురాలు తిరుగుతారు. ఆలయ సందర్శనలకు వెళ్తుంటారు. తాను ఎప్పుడు
హిందువునని చెప్పుకునేందుకు ఒక్క క్షమం సంకోచించరు. తద్వారా బీజేపీ హార్డ్ హిందూత్వ అజెండాతో ఉంటే.. కమల్ నాథ్ సాఫ్ట్ హిందూత్వ ముద్ర ధరించారని పార్టీలోని కొందరు అసమ్మతినేతలు ఆరోపిస్తున్నారు. అయితే .. గత ఎన్నికల్లో పవర్ దక్కినట్లే దక్కి చేజారింది.దీంతో ఈసారి హిందూత్వ ఓటు.. బీజేపీకి గంపగుత్తగా పడకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ఎటు తిరిగి, ఎటు వెళ్తుందో వేచి చూడాలి.













