అమెరికాతో శాంతి చర్చలకు సిద్ధం
ఆఫ్ఘాన్ శాంతి స్థాపన అంశంపై అమెరికాతో శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తాలిబన్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సౌదీ అరేబియాలో చర్చలు జరపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికాను కోరారు. సౌదీకి బదులు ఖతార్‌లో చర్చలు జరిపేందుకు తాలిబన్లు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ చర్చలకు ఆఫ్ఘాన్ అధికారులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొవద్దని తాలిబన్లు కోరారు. ఆఫ్ఘాన్‌లో 17 ఏండ్ల నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరదించాలంటే అమెరికాతో చర్చలు జరపాలని తాలిబన్లు యోచిస్తున్నారు. నిర్బంధంలో ఉన్న తాలిబన్ కీలక నేతల విడుదల, ఆఫ్ఘాన్ నుంచి విదేశీ బలగాల ఉపసంహరణ తదితర అంశాలపై తాలిబన్లు చర్చించే అవకాశముంది.













