నందమూరి సుహాసిని తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిటాల సునీత
* కూకట్ పల్లి నియోజకవర్గంలో మహా కూటమి అభ్యర్ధి నందమూరి సుహాసిని తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి పరిటాల సునీత
* కూకట్ పల్లి లోని బిజెపి కార్యాలయం సమీపం నుండి మొదలైన ఎన్నికల ప్రచారం
కూకట్ పల్లి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో మంత్రి పరిటాల సునీత గారి ప్రసంగంః
⦁ మహా కూటమి అభ్యర్ధిగా నందమూరి ఇంటి ఆడపడుచు మన అన్న ఎన్.టి.ఆర్ గారి మనవరాలు, హరికృష్ణ గారి కుమార్తె సుహాసిని మీ ముందుకు వచ్చింది.
⦁ ప్రజా సేవ కోసం వస్తున్న నందమూరి సుహాసిని ని తెలంగాణ ఆడపడుచులు ఆశీర్వదించాలి.
⦁ నందమూరి సుహాసిని ని అధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించండి.
⦁ కుకట్ పల్లి అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.
⦁ కాంగ్రెస్, తెలుగుదేశం, టి.జె.ఎ.సి (తెలంగాణ జనసమితి), సి.పి.ఐ పార్టీలు మహా కూటమిగా పోటీ చేస్తున్నాయి.
⦁ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మహా కూటమి గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.
⦁ మహా కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కదిలి రావాలి.
⦁ రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మహా కూటమి విజయం సాధించబోతుంది.
⦁ తెలంగాణ ప్రజలు విజ్ఞులు, ఎవరినైనా హక్కున చేర్చుకునే మనస్తత్వం ఉన్నవారు.
⦁ నందమూరి సుహాసిని మీ సోదరి – ఆమెను ఆదరించండి.
⦁ కేవలం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ద్వారా మరోసారి సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని ఓట్లు రాబట్టుకోవాలని టి.ఆర్.ఎస్ నాయకులు అనుకుంటున్నారు.
⦁ విజ్ఞలైన తెలంగాణ ప్రజలు అది గ్రహించాలి.
⦁ గత నాలుగేళ్లలో కూకట్ పల్లి లో ఏమి అభివృద్ధి జరిగిందో తెలంగాణ ప్రజలు గ్రహించాలి.
⦁ హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది.
⦁ ఈ రోజు మన బిడ్డలు ఇంజనీర్లు గా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందుచూపు.
⦁ హైదరాబాద్ లో హైటెక్ సి.టి నిర్మాణం చేసి పెద్ద పెద్ద ఐ.టి కంపెనీలు తీసుకువచ్చి ఐ.టి హబ్ గా మార్చారు.
⦁ శంషాబాద్ ఎయిర్ పోర్టు, ప్లై ఓవర్లు నిర్మాణం కూడ మన నాయకుడి ఘనతే.
⦁ చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి తప్ప, గత నాలుగేళ్లలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు.
⦁ హైదరాబాద్ కు ప్రపంచ స్ధాయి గుర్తింపు వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి కష్టం, కృషి వల్లే.
⦁ ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వారి పార్టీ నేతలు, కార్యకర్తలతో అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారు.
⦁ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సరైన సమయంలో గుణపాఠం చెప్తారు.
⦁ తెలుగువాళ్లు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ బ్రతికే ఉంటుంది.
⦁ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల గుండెల్లోంచి తెలుగుదేశం పార్టీ జెండాను తీసివేయడం ఎవరివల్ల కాదు…… మంత్రి పరిటాల సునీత













