దుబాయ్‌లో ఘనంగా జరిగిన జే తాళ్ళూరి సోదరుడి కుమార్తె నిశ్చితార్థం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు జే తాళ్ళూరి సోదరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, డాక్టర్ రాజా తాళ్ళూరి కుమార్తె పూజ నిశ్చితార్థం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తనయుడు రిత్విక్తో ఘనంగా జరిగింది. దుబాయ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, సినీ నటీ నటులు తరలివచ్చారు. ఈ ఎంగేజ్మెంట్కు వస్తున్న అతిధులకోసం సిఎం రమేష్ దాదాపు 15 ప్రత్యేక విమానాలు బుక్ చేయడం విశేషం. దానికితోడు 25 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ వేడుకలను ఆయన నిర్వహించారు.
ఏపీలోని అన్నీ పార్టీల నాయకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ, సినీ స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 75 మంది ఎంపీలను సీఎం రమేశ్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు సమాచారం. ఈ నిశ్చితార్థంలో సీఎం రమేశ్ దంపతులు వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలోని అమ్మో..బాపుగారి బొమ్మో..సాంగ్‌కి ఈ కపుల్ అదిరిపోయే లెవల్లో డ్యాన్స్ చేశారట. మరోవైపు జే తాళ్ళూరి బంధుమిత్రులు కూడా పెద్ద సంఖ్యలో ఈ వేడుకలకు హాజరయ్యారు.













