ఆ సినిమా విడుదల ఆపలేం
దివంగత ఎన్టీఆర్ జీవితంలోకి కీలక ఘట్టాల్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేయొద్దంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రతీ వ్యక్తికి భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని, చట్టానికి లోబడి ఎవరైనా దానిని వ్యక్తికరించుకునే వీలుంటుదని కోర్టు అభిప్రాయపడింది. సినిమాలో ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలలో ఎలాంటి ఇబ్బంది లేదని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు. దీంతో చిత్ర విడుదలకు మార్గం సుగమం అయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.













