వంద కోట్ల క్లబ్లో ఎఫ్ 2
వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ఎఫ్ 2. జనవరి 12న విడుదలైన ఈ కామెడీ ఎంటర్టైనర్ నిలకడగా కలెక్షన్స్ రాబడుతూ తాజాగా వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. మా సినిమాని ఇంత ఘనవిజయం చేసిన తెలుగు అభిమానులు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఓవర్సీస్‌లోను ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ తెలంగాణ స్లాంగ్‌లో వెంకీకి తోడల్లుడిగా అదరగొట్టాడు. చిత్రం చూసిన పెళ్ళైన మగాళ్ళు, ఆడవాళ్ళు స్టోరీలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయి పగలబడి నవ్వుకున్నారు. వచ్చే సంక్రాంతికి ఎఫ్ 2కి సీక్వెల్ చిత్రం రానుందనే సంగతి తెలిసిందే.













