అమెరికా పర్యటనలో అక్కినేని కుటుంబం
సెలవుల ఆస్వాదనకు ఒక విజయం కూడా కలిసోచ్చిందంటే ఆ ఉత్సామమే వేరుగా ఉంటుంది. ప్రయాణాలు చేసేవాళ్లకైతే విహారం మరింత సంతోషంగా మారిపోతుంది. ప్రస్తుతం అక్కినేని కుటుంబ అలా రెట్టించిన ఉత్సాహంతో అమెరికాలో సెలవుల్ని ఆస్వాదిస్తోంది. చాలా రోజులుగా తీరిక లేకుండా చిత్రీకరణలతో గడుపుతున్న నాగచైతన్య, సమంత ముందుగా అమెరికా విహారానికి బయల్దేరారు. ఇద్దరి చిత్రాలూ ఒకే రోజు విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించాయి. విజయాలు అందించన ఆ ఉత్సాహంతోనే భార్యభర్తలిద్దరూ అమెరికా విమానమెక్కారు. నాగార్జున తను నటించిన దేవదాస్ చిత్రాన్ని కుటుంబ సభ్యులందరితో కలిసి చూసి, విజయంపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ విడుదలకి ముందు రోజు అమల, అఖిల్‌తో కలిసి అమెరికా బయల్దేరారు. ప్రస్తుతం అక్కడ కుటుంబ సభ్యులంతా సరదాగా గడుపుతున్నారు. విజయం అందించిన సువాసనల మధ్య స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సెలవు రోజుల్ని గడిపితే మరింత సరదాగా ఉంటుందని నాగార్జున ట్వీట్ చేశారు.













