భారతీయులు మరిన్ని విజాయాలు సాధించాలి : సత్య నాదెళ్ల
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డు స్వీకరించడం గౌరవంగా భావిస్తాను అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. భారత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. మీ అందరిలో కలిసి పనిచేసందుకు, భారతీయుల మరిన్ని విజయాలు సాధించేలా సాంకేతికతను మీకు చేరువ చేసుకుందుకు ఎదురుచూస్తున్నా అని అన్నారు. హైదరాబాద్లో పుట్టిన సత్య నాదెళ్ల 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారు. 2021 జూన్లో అదే కంపెనీ చైర్మన్ కూడా అయ్యారు. గణతంత్ర వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.













