కేరళ యువతి గిన్నిస్ రికార్డు…140 భాషల్లో
కేరళ యువతి సుచేత సతీశ్ గొప్ప లక్ష్యం కోసం 140 భాషల్లో పాట పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఒకే కాన్సర్ట్‌లో అత్యధికంగా 140 భాషల్లో పాడినందుకు ఆమెను ఈ రికార్డు వరించింది. వాతావరణం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సంగీత విభావరిలో ఆమె తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించి, అందరి మన్నలను అందుకున్నారు. 2023 నవంబరు 24న యునైటెడ్ అరభ్ ఎమిరేట్స్, దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో ఈ కాన్సర్ట్ ఫర్ క్లైమేట్ జరిగింది.తాన పాడిన పాటను ఆమె సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. వీటిని విన్నవాంతా మంత్రముగ్ధులై, ఆమెను అభినందించారు. 9 గంటల్లో 140 భాషల్లో పాట పాడి ఈ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. భగవంతుని దయ వలన ఈ రికార్డును సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.













