అమృతా ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు … విడాకులకు ఇదే కారణం
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియతో మాట్లాడుతూ ముంబైలో మూడు శాతం విడాకులకు ట్రాఫిక్ సమస్య ప్రధాన కారణమని అన్నారు. వాణిజ్య నగరంలోని రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ సమస్యలపై ఆమె మండిపడ్డారు. నేను ఒక సాధారణ పౌరురాలిగా ఈ మాట చెబుతున్నా. ఒక్కసారి బయటకు వెళితే రోడ్లపై గుంతలు, ట్రాఫిక్ సహా అనేక సమస్యలు కనిపిస్తాయి. ట్రాఫిక్ కారణంగా ప్రజలు తమ కుటుంబాలకు తగిన సమయం ఇవ్వలేకపోతున్నారు. కుటుంబాలతో సరిగా గడపలేకపోతున్నారు. ముంబైలో మూడు శాతం విడాకులకు ఇదే కారణం అని అన్నారు.













