బెంగాల్ లో 39.97 శాతం పోలింగ్.. రెండు చోట్ల ఉద్రిక్తతలు
పశ్చిమ బెంగాల్ లో చివరి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 294 స్థానాలకు గానూ తొలి దశో 152 చోట్ల పోలింగ్ పూర్తైంది. తాజాగా మిగిలిన 142 సీట్లలో రెండో దశ పోలింగ్ జరుగుతోంది.మధ్యాహ్నం 12 గంటల వరకూ వచ్చిన లెక్కల ప్రకారం 39.97 శాతం పోలింగ్ జరిగింది. రెండో దశలో భవానీపూర్ అత్యంత కీలకమైంది. బీజేపీ నుంచి సువేందు అధికారి బరిలో వుండగా, టీఎంసీ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే రంగంలో వున్నారు. దీంతో ఇది అత్యంత కీలకంగా మారింది.
మరో వైపు 3.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఒక్క కలకత్తాలో మాత్రమే 35 వేల మందిని మోహరించారు. పారదర్శకత కోసం 142 సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశీలకులను నియమించారు. అయితే.. ప్రారంభమైన కొన్ని గంటల్లోనే హౌరాలో ఈవీఎం లోపం కారణంగా గందరగోళం ఏర్పడింది. చప్రా, శాంతిపూర్, నిమ్తలా, భాంగర్ తదితర ప్రాంతాల్లో కొన్ని హింసాత్మక ఘటనలు, విధ్వంసాలు నమోదైనట్లు పోలీసులు ప్రకటించారు. పోలింగ్ బూత్ వద్ద గొడవ చేస్తున్న ఇద్దరిని సీఆర్పీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు . పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా నియంత్రించారు. ఈవీఎంలో తలెత్తిన లోపంపై ఎన్నికల అధికారులు దర్యాప్తు చేపట్టారు. అవసరమైతే యంత్రాన్ని మారుస్తామని తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భద్రతను మరింత పెంచారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి








