జో బైడెన్-ప్రధాని మోదీ వర్చువల్ భేటీ
యుద్ధ తాకిడికి గురైన ఉక్రెయిన్ను ఆదుకునేందుకు భారతదేశం అన్ని చర్యలూ తీసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఓ వైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి సామరస్యాలకు పాటుపడ్డామని, మరో వైపు ఉక్రెయిన్‌కు ఔషధాలు, ఇతరత్రా సహాయ సామాగ్రి అందించామని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య నేరుగా సాగుతోన్న సంప్రదింపులు ఫలిస్తాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లోని సామాన్య పౌరుల భద్రతకు, అక్కడ చిక్కుపడ్డ విదేశీయుల తరలింపునకు తమ దేశం ప్రాధాన్యత ఇచ్చిందని బైడెన్‌కు మోదీ వివరించారు. ఇటీవలే బుచాలో అమాయక పౌరుల వధ జరిగిందని తెలిసిందని, దీని పట్ల ఆందోళన వ్యక్తం చేశామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ గర్హనీయ ఘటనపై దర్యాప్తునకు భారత్ డిమాండ్ చేస్తోందని అన్నారు.
ప్రపంచ సమస్యలపై భారత్ అమెరికాల పరస్సర సాయం అవసరం అని ఇంతకు ముందు నిర్ణయాన్ని వచ్చిన విషయాన్ని మోదీ బైడెన్‌కు గుర్తు చేశారు. ఉక్రెయిన్ సంక్షోభ విషయాన్ని మోదీ బైడెన్‌కు గుర్తుచేశారు. ఉక్రెయిన్ సంక్షోభ నివారణకు భారత్ మరింత చొర చూపాలని బైడెన్ కోరినట్లు తరువాత అధికారిక ప్రకటన వెలువడిరది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో వర్చ్యువల్‌గా అయినా భేటీకి తాను ఆసక్తితో ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అంతర్జాతీయంగా ఆంక్షల చిక్కుల్లోకి నెట్టి ఏకాకిని చేయాలని అమెరికా భావిస్తోంది. దీనికి భారత్ నిర్ణయం గండి కొట్టిందని అమెరికా తీవ్రస్థాయిలో ఇటీవలే స్పందించింది. ఈ క్షణం కోసం వేచి ఉన్నాయని బైడెన్ వ్యాఖ్యానించారు.













