South Korea: దక్షిణకొరియా ముందు గల్ఫ్ దేశాల క్యూ..చెయోంగుంగ్ కోసం పోటాపోటీ…!
ఇరాన్ (IRAN) వార్ లో గల్ఫ్ దేశాల మీద మిస్సైల్స్ వర్షం కురుస్తోంది. అమెరికా(US), ఇజ్రాయెల్ దాడులు పెంచినప్పుడల్లా ఇరాన్ సైతం..గల్ఫ్ మీదకు క్షిపణుల దండు ప్రయోగిస్తోంది. ఇలాంటి సమయంలో అన్ని దేశాలు దాడులతో అల్లాడుతుంటే..యూఏఈ మాత్రం కాస్త సేఫ్ గా ఉంది.దీనికి కారణం.. ఈదేశం దక్షిణకొరియా దగ్గర కొనుగోలు చేసిన చెయోంగుంగ్ క్షిపణీ వ్యవస్థ.. ఇది ఏకంగా 96శాతం విజయవంతంగా క్షిపణులను అడ్డుకుంటోంది.
దీంతో మిగిలిన దేశాలు కూడా.. ఇప్పుడు దక్షిణ కొరియా ముందు క్యూ కడుతున్నాయి. తమకు కూడా చెయోంగుంగ్ క్షిపణీ రక్షణ వ్యవస్థ కావాలని కోరుతున్నాయి. కోరడం కాదు..ప్రార్థిస్తున్నాయి. దీంతో
దక్షిణ కొరియా (South Korean missile system)గగనతల క్షిపణి వ్యవస్థకు భారీగా డిమాండ్ ఏర్పడిందని చెప్పవచ్చు..
ఇవి కూడా చదవండి
పొరుగుదేశం ఉత్తర కొరియా నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకునే లక్ష్యంతో దక్షిణ కొరియా దేశీయంగా క్షిపణి వ్యవస్థ చెయోంగుంగ్ వ్యవస్థ (M-SAM Block II)ను అభివృద్ధి చేసింది. మధ్యశ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ లక్ష్యంగా దీనిని రూపొందించింది. అమెరికా తయారీ పేట్రియాట్ ప్యాక్-3 వ్యవస్థతో పోటీపడటమే గాకుండా.. దాని ధరలో నాలుగో వంతుకే లభ్యమవుతోంది.
‘‘మన దేశ క్షిపణి వ్యవస్థ కోసం పశ్చిమాసియా దేశాలు బారులు తీరుతున్నాయి. ఆ సిస్టమ్ పనితీరే అందుకు కారణం. 90 శాతానికి పైగా సక్సెస్ రేట్‌తో బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తోంది’’ అని దక్షిణకొరియా ఆర్థిక మంత్రి కో యు చియోల్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు.
పేట్రియాట్, థాడ్ వ్యవస్థలు పశ్చిమాసియా దేశాల్లో మోహరించి ఉన్నప్పటికీ.. వేగంగా డెలివరీకి అవకాశం ఉన్న చెయోంగుంగ్ వైపు అరబ్ దేశాలు మొగ్గుచూపుతున్నాయి. అమెరికా ఆయుధాలపై ఆధారపడటం తగ్గించాలన్న ఆలోచనా దీనివెనక ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ద.కొరియా వ్యవస్థను యూఏఈ వినియోగిస్తోంది. ఈమేరకు 2022లోనే 3.5 బిలియన్ డాలర్ల డీల్ చేసుకుంది. అదే బాటలో సౌదీ అరేబియా, ఇరాక్ కూడా నడిచాయి.
ఇవి కూడా చదవండి








