TANA: తానా మదర్స్ డే వేడుకలు మే 17న

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో మే 17వ తేదీన మదర్స్ డే వేడుకలను తానా మిడ్ అట్లాంటిక్ విభాగం వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. వెస్ట్ ఛెస్టర్ ఈస్ట్ హైస్కూల్ లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా సునీత (Sunitha) ఉపద్రష్ట హాజరవుతున్నారు. ఈ వేడుకలకు అందరూ హాజరుకావాల్సిందిగా తానా మిడ్ అట్లాంటిక్ విభాగం నాయకులు కోరారు.