TDF-CII: టిడిఎఫ్, సిఐఐ ఆధ్వర్యంలో ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై సమావేశం

తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం(TDF), యుఎస్‌ఎ, కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) కలిసి సంయుక్తంగా హైదరాబాద్‌లో ఉన్నతవిద్య, యువత సాధికారత అన్న అంశంపై సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఐటీసి కాకతీయ హోటల్‌లో ఫిబ్రవరి 22వ తేదీన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు, ఉన్నతాధికారులు, సిఐఐ నాయకులు, టిడిఎఫ్ నాయకులు పలువురు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఉన్నతవిద్యలో చేయాల్సిన మార్పులు, ఇతర అంశాలపై ఓ నివేదికను కూడా రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు టిడిఎఫ్ నాయకుడు గోపాల్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
శ్రీమతి అరుణ
Email – aruna.mantena@cii.in
Ph: 040-27765964