తెలంగాణలో 4 వేలు దాటేశాయ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల పరంపర కొనసాగుతోంది. బుధవారం 191 మందికి పాజిటివ్ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,111కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 143 ఉండగా, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 11 చొప్పున, రంగారెడ్డి జిల్లాలో 8, మహబూబ్నగర్లో 4, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో మూడు చొప్పున, నాగర్కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో 2 చొప్పున, నిజామాబాద్, సిద్ధిపేట, వికారాబాద్, నల్గొండ జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,817 మంది డిశ్చార్జి కాగా, 2,138 మంది చికిత్స పొందుతున్నారు. ఇక బుధవారం ఒక్కరోజే 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఈ వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 156కి పెరిగింది.






