అమెరికా తర్వాత మనమే!
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సాగిస్తోంది. గడచిన వారం రోజులుగా ప్రతి రోజూ 9 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లోనే అత్యధికంగా 9,987 కేసులు నమోదయినాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,66,598కి చేరుకుంది. మరో వైపు మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి రికార్డు స్థాయిలో 331 మంది మృత్యువు వాత పడ్డారు. కరోనా కేసుల విషయంలో సంఖ్యాపరంగా భారత్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న బాధితుల సంఖ్యలో రెండో స్థానంలో ఉంది. కోవిడ్ 19 కు సంబంధించి అంతర్జాతీయ గణాంకాల సంస్థ వరల్దో మీటర్ ప్రకారం విషమంగా ఉన్న కరోనా బాధితులు సంఖ్యాపరంగా అమెరికా (16,907) తొలిస్థానంలో ఉండగా 8,944 కేసులతో భారత్ తర్వాతి స్థానంలో ఉంది. కాగా బ్రెజిల్, రష్యాలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ సీరియస్ కేసులు తక్కువగా ఉన్నాయి.






