ఫిలడెల్ఫియాలో వైయస్సార్ వర్ధంతి…మెగా రక్తదాన శిబిరం
డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైయస్సార్ 12వ వర్ధంతి సందర్బంగా ఫిలడెల్ఫియా నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో మెగా రక్తదాన శిబిరాన్ని సెప్టెంబర్ 11న నిర్వహించారు. డాక్టర్ రాఘవ రెడ్డి గోసల సమన్వయకర్తగా ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఆళ్ళ రామిరెడ్డి, శరత్ మందపాటి, శ్రీకాంత్ పెనుమాడ, హరి వెళ్కూర్, నాగేశ్వర రెడ్డి ముక్కమల్ల, లక్ష్మినరసింహ రెడ్డి కొండా, హరి కురుకుండ, వెంకటరామి రెడ్డి శనివరపు, శ్రీనివాస రెడ్డి ఈమని, విజయ్ పోలంరెడ్డి, మధు గొనిపాటి, అంజి రెడ్డి సాగంరెడ్డి, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, ద్వారక వారణాసి, భానోజీ రెడ్డి, రాజేంద్ర మోదుగుల, ఆనంద్ తొండపు, గీతాంజలి, లక్ష్మీనారాయణ రెడ్డి, పద్మనాభ రెడ్డి చంద్ర దొంతరాజుతో సహా పలువురు వైస్సార్ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.
గత పన్నెండు సంవత్సరాలుగా రాజన్నను స్మరించుకుంటూ రక్తదానం చేసి వేలాది మంది ప్రాణాలు కాపాడి ప్రాణదాతలుగా నిలిచారు. ముఖ్యంగా ఈ కోవిడ్ మహమ్మారి వున్నప్పుడు రక్తం అవసరం కూడా ఎంతో వున్నా తక్కువ మంది దాతలు ముందుకు వస్తున్నారు. ఇలాంటి వేళలో కూడా ప్రజా శ్రేయస్సు కోసం మన వైస్సార్ అభిమానులు ముందుకు వచ్చి రక్త దానం చేయడం నిజంగా ప్రశంసనీయం మరియు అదే మన రాజన్నకు ఇచ్చే ఘనమైన నివాళి అని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వైయస్సార్ ను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు వైస్సార్ అభిమానులను ప్రత్యేకంగా సమన్వయ కర్త డాక్టర్ రాఘవ రెడ్డి గోసలని ప్రశంసించారు.
ఈ రక్త దాన శిబిరంలో ఆనంద్ తొండపు, అనిల్ కాశిరెడ్డి, అనిల్ యాదవ్, బాలకృష్ణ బోడిరెడ్డి, భరత్ కొట్టాల, భ్రమరాంబిక కారికేశమ్మ, దేవేందర్ రెడ్డి హనుమయ్యగారి, హర్ష నిమ్మల, జగన్నాథ రెడ్డి పుచ్చ, జనార్దన్ బద్దం, కిరణ్ రెడ్డి గూడూరు, లక్ష్మినరసింహ రెడ్డి కొండా, మధు అందురు, మధు పూడూరు, నాగ వంశి బొమ్మారెడ్డి, నాగేంద్ర ముక్కమల్ల, నగేష్ గోదాసి, నాగేశ్వర రావు చిలుకూరి, నాగేశ్వర రెడ్డి ముక్కమల్ల, నిర్మల బైరెడ్డి, నితిన్ రెడ్డి పిన్నంరెడ్డి, ప్రసన్న బయపురెడ్డి, రాఘవ రెడ్డి గోసల, రాహుల్ చిద్రి, రజని పాలగిరి, రాజేంద్ర మోదుగుల, రాజేంద్ర రెడ్డి వాళ్ళపాలెం, రాజ్ కుమార్ అల్చురు, రామ్మోహన్ ఎల్లంపల్లి , రామచంద్ర దేశరాజ్, రామక ృష? ముస్సాని, రామిరెడ్డి జొన్నలగడ, రవీంద్ర పల్లెర్ల, రెడ్డయ్య ఉండేలా, సదానందం భారత, సాహితి గోసల, శరత్ మందపాటి, సస్య లక్ష్మి అమరవాది, సతీష్ కొమ్మారెడ్డి, శివ చల్లా, శివ రెడ్డి తాటిమకుల, శివ తరుణ్ రెడ్డి పొన్నపురెడ్డి, స్నేహి ముక్కామల్ల, శ్రీధర్ గుదేటి, శ్రీకాంత్ పెనుమాడ, శ్రీకాంత్ రెడ్డి పాలూరి, శ్రీనివాస భీమిరెడ్డి, సుశిని ముక్కమల్ల, తనూజ కాసిరెడ్డి, వర్ష పాలగిరి, వరుణ్ రెడ్డి గూడూరు, వెంకట కూనమ్, వెంకట మోహన్ గడిబావి, వెంకట నాగార్జున తమ్మినేని, వెంకట పుసులూరు, వెంకట్ నొస్సం, విజయ్ పోలంరెడ్డి, విజయభాస్కర్ యాటె, విరాజ్ రెడ్డి, యుగంధర్ రెడ్డి పిన్నంరెడ్డితో పాటు అనేక మంది స్థానికులు రక్త దానం చేసి ప్రాణ దాతలుగా నిలిచారు.













