పరిస్థితి దారుణం… సాయం చేస్తా : ట్రంప్
ఇండో-చైనా సరిహద్దు ఘర్షణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. వైట్‌హౌజ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్, చైనా మధ్య సరిహద్దు సమస్య దారుణంగా మారింది. ఈ సమస్య పరిష్కారంలో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. రెండు దేశాల బలగాల మోహరింపులతో అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. అక్కడ సరిహద్దు సమస్య ప్రమాదంగా ఉంది. రెండు దేశాలతోనూ ఈ అంశం గురించి చర్చించాను. ఒకవేళ మేం ఏదైనా చేయాలనుకుంటే, ఆ సమస్యను పరిష్కరించగలమని, వారికి హెల్ప్ చేయగలమని ట్రంప్ అన్నారు. ఈ విషయంపై రెండు దేశాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇరుదేశాలను అమెరికా గౌరవిస్తుందని అన్నారు. సరిహద్దు సమస్యపై అమెరికా సాయం ప్రస్తావన తీసుకురావడం ఇదే తొలిసారి.













