యుఎస్ ఓపెన్ నుంచి బార్టీ ఔట్
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ప్రపంచ నంబర్‌వన్ ఆశ్లే బార్టీ దూరమైంది. కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో తాను ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. యూఎస్ ఓపెన్ టోర్నీకి ముందు జరిగే వెస్ట్రన్, సదరన్ టోర్నీలకు కూడా బార్టీ దూరమవుతున్నట్టు ఆమె మేనేజర్ తెలిపాడు. నాకు ఇష్టమైన టోర్నీలను మిస్సవుతున్నాను. కానీ కొవిడ్ 19 దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నా జట్టును ప్రమాదంలోకి నెట్టాలనుకోవడం లేదు అని బార్టీ పేర్కొంది.













