విదేశాల నుంచి పంపే సొమ్ము 20 శాతం తగ్గొచ్చు
కరోనా వైరస్ వ్యాప్తి మూలంగా ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు వెళ్లిన వారు పని లేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. కొంత మందికి వేతనాలు కూడా అందడం లేదు. ఈ నేపథ్యంలో వారు తమ ఇంటికి పంపే సొమ్ము తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంక్ చెబుతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావంతో అభివృద్ధి చెందుతున్న దేశాలు రెమిటెన్స్ రూపంలో తమకున్న కీలకమైన రాబడి మార్గాన్ని కోల్పోతున్నాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది విదేశీ కార్మికులు తమ దేశాలకు పంపే సొమ్ము (రెమిటెన్స్) 20 శాతం తగ్గవచ్చని ప్రపంచబ్యాంక్ ఒక నివేదికలో వెల్లడించింది.













