చైనాపై కత్తి దూసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై కత్తి దూస్తున్నాడు. చైనా వాణిజ్య ఉల్లంఘనలకు ప్రతస్పందనగా వాణిజ్య ఆంక్షలు విధించే ఆస్కారం ఉన్నట్టు అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించింది. బీజింగ్ మేధోనం పత్తి హక్కులు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించిన కట్టుబాట్లను ఉల్లఘించిందనేందుకు బలమైనా సాక్ష్యాలున్నట్టు అమెరికా వాణిజ్య ప్రతినిధి ప్రకటించారు. ఇందుకు ప్రతిగా యుఎస్టిఆర్ 301 కింది ట్రంప్ చైనాపై వాణిజ్య ఆంక్షలు ప్రకటించనున్నట్టు వైట్‌హౌస్ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ రాజ్ షా తెలిపారు. అంతకు మించి వివరలు ప్రకటించడానికి అధికారులు నికాకరించారు.













