సూర్యరశ్శితో వైరస్ నాశనం : అమెరికా
అత్యధిక ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ఉండే ప్రాంతాల్లో కొవిడ్-19 ఎక్కువ కాలం బతకలేదని అమెరికా ప్రభుత్వ ల్యాబ్ ప్రయోగ ఫలితాల్లో తేలింది. వైరస్‌ను సూర్యరశ్శి త్వరగా నాశనం చేస్తుందని కూడా గుర్తించారు. నియంత్రిత పరీక్షల ద్వారా ఈ విషయాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ వీటిని ఇంకా నిరూపించలేదు. అధికారిక వినియోగానికి మాత్రమే అని సూచించిన ఈ ప్రాథమిక ఫలితాలు నోట్‌ను తాము సంపాదించినట్లు యాహూ న్యూస్ వెల్లడించింది. అయితే కరోనా మహమ్మారి వేసవి కాలంలోనూ ప్రతాపం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













