అమెరికాకు నాలుగున్నర లక్షల రక్షణ సూట్లు
కరోనా మహమ్మారిపై పోరులో అమెరికాకు సహకరించేందుకు వియత్నాం ముందుకొచ్చింది. అగ్ర రాజ్యానికి 4,50,000 రక్షణ సూట్లను శనివారం నాడు నౌకలో పంపింది. కరోనా బాధితులకు సేవలందించే అమెరికన్ వైద్య బృందాలకు రక్షణ పరికరాల కొరత పెద్ద సమ్యగా మారింది. ఆధునాతన యుద్ధ ట్యాంకులు, అణు బాంబుల తయారీలో ముందుండే అమెరికా, మాస్కులు, వెంటిలేటర్లు, గ్లౌజులు, గౌనులు, ఇతర రక్షణ సామగ్రి విషయంలో ఇతర దేశాలపై ఆధారపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్లతో సహా యూరోపియన్ దేశాలకు 5 లక్షలకు పైగా మాస్కూలను నౌకలో వియత్నాంలోని సోషలిస్టు ప్రభుత్వం పంపింది.













