డల్లాస్ లో ఘనంగా వాసవీ మాత ఉత్సవాలు
డల్లాస్లో ప్రవాస భారతీయ వాసవి అసోసియేషన్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. స్థానిక డీఎఫ్డబ్ల్యూ హిందూ దేవాలయ సాంస్క తిక భవనంలో జరిగిన వేడుకల్లో సుమారు 900 మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పల్లకిలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కనుల పండువగా జరిగింది. వాసవి మాత అలంకరణ, సుందర ఆలయ ప్రాంగణంలో భజనలు, కీర్తనల ఆలాపనలతో మార్మోగుతూ, స్వదేశంలో జరుపుకునే భక్తి ఉత్సవాలని గుర్తుకుతెచ్చాయి. చివరగా రుచికరమైన ఇంట్లో వండిన వంటకాలను అరటి ఆకులలో సాంప్రదాయ దుస్తులు ధరించిన బాల బాలికలు, పంక్తి భోజనంలో వడ్డించారు.
ఈ సందర్భంగా ”వాసవి జయంతి” కార్యవర్గ నిర్వాహకులను ప్రవాస భారతీయ వాసవి అసోసియేషన్ అమెరికా అధ్యక్షుడు అయితా నాగేందర్ అభినందించారు. ఎన్ఆర్ఐవీఏ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల వివరాలను తెలిపారు. 2019 జూలై మాసంలో డెట్రాయిట్లో జరుగబోతున్న ప్రపంచ వ్యాప్తంగా పలు వాసవి ప్రియులు పాల్గొంటున్న ఎన్ఆర్ఐవీఏ కన్వెన్షన్ కు డల్లాస్ వారందరిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
వాసవి జయంతి ఉత్సవ నిర్వాహులైన ఎన్ఆర్ఐవీఏ అమెరికా ప్రాంత పాలక మండలి సభ్యులు వీరవెల్లి శ్రీనివాస్, డల్లాస్ విభాగ సలహాదారు పెన్నం సుధాకర్, విభాగ కార్యదర్శులు గుండా చంద్ర, కొండూరు కిశోర్, బజ్జూరి రవి, ముఖ్య సభ్యులైన కాంభోజి లక్ష్మి, అలిశెట్టి హరి, కొప్పరపు బాల, శివపురం ప్రణీత్, బజ్జూరి రాము, ఉసిరికల మురళి, అద్దేపల్లి వెంకట్, రంగ అర్జున్, మువ్వల సాయిరాం, వెలగ సుధీర్లందరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు సుబ్బా రావు, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, గణపురం మహేందర్, మద్ది రవి, గెల్లి ఆది, కొత్త రామక ష్ణ కుంచం మహేందర్, పోపూరి నరసింహ , బొగ్గురం వాసుదేవ్, కాజ మన్యం, ఆర్థం చంద్ర, అరవపల్లి శ్రీని, జానుంపల్లి వేణు, వెలుగూరి కాశి, గర్రెపల్లి శ్రీనివాస్, శ్రీపురం నీరజ్, కొత్తమాసు సుధాకర్, పులిపాటి నాగేష్ తదితరులు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు.













