అమెరికాలో తొలి హిందూ-అమెరికన్ సదస్సు
అమెరికా పార్లమెంటు భవనం కాపిటల్‌లో తొలి హిందూ అమెరికన్ సదస్సును నిర్వహించనున్నారు. రాజకీయ ఆకాంక్షలతో అమెరికన్స్ 4 హిందూస్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 14న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థీతో పాటు మరికొందరు ప్రముఖులు ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో చట్టసభ్యుల ముందు అమెరికాలోని హిందూ సమాజం తన సమస్యలను విన్నవించనుంది. దేశ వ్యాప్తంగా హిందూ, ఇండియన్ సంస్థలకు సంబంధించి సుమారు 130 మంది నాయకులు దీనికి హాజరవ్వనున్నారు. హిందూ అమెరికన్లు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. ఈక్వాలిటీ ల్యాబ్స్, కేర్ వంటి సంస్థలు హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందువల్ల మేము హిందూ అమెరికన్లు అందరినీ ఏకం చేసి, మా వాదనలను ముందుకు తీసుకెళ్లాని భావిస్తున్నాం అని కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న రోమేశ్ జాప్రా వివరించారు.






