ఫైజర్ కంపెనీతో అమెరికా భారీ ఒప్పందం
కరోనాను నియంత్రించే టీకా తయారీ ఇంకా తుది దశకు చేరకు ముందే ఔషధ సంస్థలతో అమెరికా భారీ ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. తాజాగా ఫైబర్ కంపెనీతో పది కోట్ల డోసుల టీకా సరఫరాకు ఉద్దేశించిన కాంట్రాక్టుపై సంతకాలు చేసినట్లు అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగ మంత్రి అలెక్స్ అజార్ వెల్లడించారు. ఆ కంపెనీ తయారు చేసే టీకా తొలి పది కోట్ల డోసులకు అమెరికాకే ఇవ్వాలన్నది ఆ ఒప్పందంలోకి కీలకాంశం. మరో 50 కోట్ల డోసులను కూడా ఇదే ఒప్పందం కింద అమెరికా కొనుగోలు చేయగలదని అలెక్స్ తెలిపారు. అయితే. ఈ టీకా ప్రభావవంతమైనదని, సురక్షితమైనదని అమెరికా ఆహార, ఔషధ విభాగం ఎఫ్డీఏ ఆమోదించిన తర్వాతే ఒప్పందం అమలుకోకి వస్తుందని చెప్పారు. 10 కోట్ల డోసులకు గాను అమెరికా ప్రభుత్వం సుమారుగా రూ.14,550 కోట్లు (195 కోట్ల డాలర్లు) చెల్లించనుంది.













