జనవరి 29 నుంచి హెచ్-1బీ వీసాల రెన్యూవల్
హెచ్-1బీ వీసాలను అమెరికాలోనే రెన్యువల్ చేసుకోవడానికి సంబంధించిన పైలట్ ప్రోగ్రామ్ విధివిధానాలను అగ్రరాజ్యం ప్రకటించింది. 2024 జనవరి 29 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో దరఖాస్తుదారులు అమెరికా విదేశాంగ శాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తొలిదశలో 20 వేల దరఖాస్తులకు ఈ పైలట్ ప్రోగ్రామ్ను పరిమితం చేశారు. భారత్, కెనడాలోని అమెరికా కాన్సులేట్లలో నిర్దిష్ట తేదీల్లో జారీ చేసిన హెచ్-1బీ వీసాలు కలిగి ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని యూఎస్ ఫెడరల్ రిజస్టర్ నోటీసులో పేర్కొన్నారు.
ఈ వీసా పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొనడానికి 12 పరిమితులను విధించారు. స్థానికంగా హెచ్-1బీ వీసా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకొనేవారు ఈ`ఫైలింగ్ చేసిన డీఎస్-160 ఫాంను తప్పనిసరిగా సమర్పించాలి. అలాగే ఆన్లైన్ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తు, వెబ్సైట్ లోని నిబంధనలకనుగుణంగా గత వారు నెలల్లో తీసిన ఫొటో, అమెరికాకు ప్రయాణించడానికి చెల్లుబాటయ్యే పాస్పోర్టు కూడా అవసరం.













