జూలై 23 నుంచి అమెరికా, భారత దేశాల మధ్య రాకపోకలు ప్రారంభం
భారతదేశ ప్రభుత్వం ఇండియా – అమెరికా మధ్య పౌర విమాన సేవలకి అనుమతి ఇచ్చినట్టు మరియు భారతదేశం చివరిగా జూన్ లో విదేశీ వాయు రవాణా సేవలు నడపటం పై పెట్టిన ఆంక్షలు అన్నీ రద్దు చేసినట్లు అని శుక్రవారం జూలై 17 న అమెరికా రవాణా శాఖ వెల్లడించింది. ప్రధాన అమెరికా విమానయాన సంస్థలు మరియు వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం ఈ ప్రకటన పైన ఇంకా స్పందించాలిసి ఉంది.
జూన్ నెలలో భారతదేశ ప్రభుత్వం, భారతదేశంలో విదేశీ వాయు రవాణా సేవలు నడపటానికి ముందస్తుగా సరైన వివరణ తో ప్రత్యేక దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని పెట్టిన ఆంక్షలు పైన అమెరికా రవాణా శాఖ జూన్ లో “భారతదేశం అన్యాయమైన మరియు వివక్షత లేని పద్ధతుల్లో వాయు రవాణా సేవలు నిలిపివేసింది” అని ఆరోపించింది. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా “మా అంతర్జాతీయ పౌర విమానయాన సేవలని సక్రియం చేస్తున్నాం ” మరియు కొన్ని విమానయాన సేవలు ఇక్కడ నుంచి “అమెరికా, యుఎఇ, ఫ్రాన్స్ & జర్మనీలతో పాటు అనేక ఇతర దేశాలకి కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.” అని వెల్లడించింది.













