చైనా రాయబార కార్యాలయం మూసివేయండి : అమెరికా
అమెరికాలోని హ్యూస్టన్లో చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించింది. దీని కోసం 72 గంటలు గడువు ఇచ్చినట్లు స్థానిక మీడియా ద్వారా తెలిసింది. మరోవైపు హ్యూస్టన్లోని చైనా రాయబార కార్యాలయం ప్రాంగణం వద్ద భారీగా పేపర్లు, పైళ్లను తగులబెట్టడంతో మంటలు, పొగ కనిపించినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దీంతో అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయని, అయితే చైనా రాయబార అధికారులు వాటిని లోనికి అనుమతించలేదని తెలిపాయి. అనంతరం కొతసేటికి మంటలను ఆర్పివేసినట్లు స్థానిక టీవీ చానళ్లు వెల్లడించాయి. హ్యూస్టన్లోని రాయబార కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రానికి చైనా అధికారులు ఖాళీ చేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసిందని స్థానిక మీడియా పేర్కొంది.













