హెచ్-4 వీసాదారులకు రక్షణ బిల్లు
హెచ్-4 వీసా కింద ఉద్యోగం చేసుకునే అవకాశాలు రద్దు కాకుండా పరిక్షించేందుకు వీలుగా చట్టం చేసేందుకు ప్రతినిధుల సభలో కాలిఫోర్నియా నుంచి ఇద్దరు కాంగ్రెస్సభ్యులు ఎనా ఎఘా, ఎఫ్గ్రెన్ బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్1 బీ వీసా కలిగి ఉన్నవారి జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకోవడానికి హెచ్-4 వీసా వీలుకల్పిస్తుంది. అయితే ఈ వీసాల కింద హెచ్-1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేయడానికి వీలు కల్పించే హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) నిబంధనలను రద్దు చేస్తామని ఈ వారం ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. చాలా మంది హెచ్-1బీ ఉద్యోగస్థుల కుటుంబాల ఆర్థిక అవసరాలను గుర్తించిన అప్పటి అధ్యక్షుడు ఒబామా వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతిస్తూ హెచ్-4 కింద వీలుకల్పించారు. దీంతో లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఎక్కువమంది భారతీయులకు ముఖ్యంగా మహిళలకు ప్రయోజనం కలిగింది.













